Karthika Deepam Serial 14 January 2020 Episode

Karthika Deepam Serial 14 January 2020 Episode 

(కార్తిక దీపం సీరియల్ 14 జనవరి 2020 ఎపిసోడ్)

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….కార్తికదీపం 704 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

కార్తీకదీపం 704 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam 704 Episode Highlights ):-

కనిపించకుండా పోయిన హిమ…..  వెతుకులాటలో కార్తీక్…….  టెన్షన్ తో ఇంటి సభ్యులు

దీప పైన ఆగ్రహంతో సౌర్య:-

కార్తీక దీప ఫోన్ చేసి ఎందుకు ఎందుకు నిజం చెప్పావు అని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు దాంతో దీపా కోపంగా ఇంట్లోకి వచ్చి సౌర్య అని తిడుతుంది నువ్వు ఈమెకి నిజం ఎందుకు చెప్పావు అని దాంతో కోపం వచ్చి నేను నిజం చెప్పాను అని చెప్పాడా ఆ డాక్టర్ బాబు మన ఇద్దర్ని ఏడిపిస్తుంది గాక ఇప్పుడు ఇలా అబద్ధాలు కూడా చెప్తున్నాడా అంటూ దీప చేతిలో ఫోన్ లాక్కొని కార్తిక్ కి ఫోన్ చెయ్ పోతూ ఉండగా. ఇంతలో దీప  ఎవరికీ ఫోన్ అని తర్వాత కార్తీక్ కి అని తెలుసుకుని  సౌర్య చేతిలో ఫోను లాక్కుంటుంది.

తర్వాత నేను నిజం చెప్పాను అని అంటావ్ ఏంటి నువ్వే నిజం చెప్పి అని సౌర్య అంటుంది.  దాంతో దీపకి కోపం వచ్చి నేనెందుకు చెబుతాను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు సౌర్య నువ్వు చెయ్యని తప్పుకి నేను అంటే నీకు ఎంత కోపం వచ్చింది అలాగే నాకు కోపం వస్తుంది నేను చెప్పలేదు అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ స్కూల్లో హిమకి నిజం ఎలా తెలిసిందో దీపకి చెప్తుంది ఇవేవీ తెలుసుకోకుండా నన్ను తిడతావా అని కోపంగా అక్కడి నుంచి లేచి నేను అన్నం తినను అని అలుగుతుంది. దాంతో దీపా పో అలుగు నేను మాత్రం బ్రతిమిలాడను ఆకలి వేస్తే నువ్వే వచ్చి తింటావు అని అంటుంది.

హిమ కనిపించకుండా పోతుంది:-

కట్ చేస్తే పేషెంట్ ఎమర్జెన్సీ అయిపోయాక కార్తీక్ ఐసియు నుంచి బయటకు వస్తే ఏం చెప్పాలా అనే సందిగ్ధం తో ఆలోచిస్తూ తన రూమ్ లోకి వచ్చి చూడగానే అక్కడ హిమ కనిపించదు దాంతో కార్తీక్ కంగారుగా హాస్పిటల్ అంతా వెతుకుతాడు కనబడిన వాళ్లందరినీ అడుగుతాడు ఎవరు చూడలేదు అని చెప్తారు.

భాగ్యంకి క్లాస్ పీకిన సౌందర్య:-

కట్ చేస్తే శ్రావ్య కి తన నాన్న జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు తర్వాత శ్రావ్య తన అమ్మ భాగ్యం గురించి అడుగుతుంది. అప్పుడు శ్రావ్య నాన్న పైన మీ అమ్మ భోజనం చేస్తుంది అని చెప్తూ ఉండగానే భాగ్యం పై నుంచి వచ్చి తన తిన్న కూర గురించి చెప్తూ ఉంటుంది. తర్వాత తండ్రి కూతురు ఇద్దరూ భాగ్యం మీద జోకులు వేస్తూ ఉంటారు. దాంతో భాగ్యం వాళ్ళని తిడుతూ మధ్యలో సౌందర్య గురించి ఇలా అంటుంది’ అసలు నేను చూసినట్టు కనీసం  అర్థ పావు వంతైనా మీ అత్త చూసిందా’ అని అంటూ ఉండగా గుమ్మంలో నుంచొని ఉన్నా సౌందర్య ని చూసి భాగ్యం మాట్లాడడం ఆపేసి బొమ్మ లాగా బిగుసుకుపోతుంది. సౌందర్య ఇంట్లోకి వచ్చి సుతిమెత్తని సూది లాంటి మాటలతోటి  భాగ్యంని తిడుతుంది. తర్వాత అసలు నేను అడగాలి నిన్ను కడుపుతో ఉన్న కూతురు గుమ్మం దగ్గరకు వస్తే కనీసం అర్ధ పావు అన్నం అయినా పెట్టి పంపించలేదు, కనీసం అల్లుడు విడాకులు ఇస్తాను అంటుంటే ఏనాడైనా మా ఇంటికి వచ్చి నీ కూతురు విడాకుల గురించి మాట్లాడావా అని బాగా గడ్డి పెడుతుంది సౌందర్య భాగ్యానికి.

తర్వాత శ్రావ్య లేచి రండి అత్తయ్య లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము మా అమ్మ సంగతి మీకు తెలిసిందే కదా అని సౌందర్య, ఆనందరావు ని లోపలికి తీసుకు వెళ్తుంది.

హిమని వెతుక్కుంటూ కార్తీక్:-

కట్ చేస్తే కార్తీక్ కార్ లో హిమని వెతుకుతూ తన గురించి తన చిన్నప్పటి నుంచి అల్లరి అంతా గుర్తుతెచ్చుకుంటూ కార్తీక్ బాధపడుతూ రోడ్డు మీద ఏమైనా కనిపిస్తుందేమో అని వెతుకుతూ కార్లో వెళ్తూ ఉంటాడు మధ్యలో ఆపి ఇంటికి ఫోన్ చేసి మాలతి ని అడుగుతాడు హిమ వచ్చిందా అని మాలతి రాలేదని చెప్తుంది తర్వాత సౌందర్య కి కూడా ఫోన్ చేస్తాడు పక్కన నవ్వులు వినిపించి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. అప్పుడు సౌందర్య ఇలా శ్రావ్య వాళ్ల ఇంటికి వచ్చాము అని సమాధానం చెబుతుంది.  తర్వాత కార్తీక్ హిమ నీతో ఏమైనా ఉందా అని అడుగుతాడు దాంతో సౌందర్య అదేంటి నీతో పాటు రాలేదా అని అడుగుతుంది,  నువ్వు హ్యాపీగా నవ్వుకో అన్నట్టుగా మాట్లాడి కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో సౌందర్య హిమ కనిపించటం అంటా తర్వాత సౌందర్య ఆనందరావు ఇద్దరూ టెన్షన్గా అక్కడినుంచి వెళ్ళిపోతారు.

తర్వాత కార్తీక దీప కూడా ఫోన్ చేసి అడుగుతాడు దాంతో దీప కూడా టెన్షన్ గా అదేంటి నా దగ్గర లేదు అని చెప్పడంతో కార్తీక్ ఫోన్ పెట్టేసి హిమని మళ్లీ వెతకడం స్టార్ట్ చేస్తాడు.

కమింగ్ అప్ లో:-

కార్తీక్ సౌందర్య ఇంకా ఊరంతా వెతికి అలసిపోయే ఆఖరికి ఇంటికి వస్తారు. హిమ అక్కడే చెప్పుల స్టాండ్ దగ్గర పడుకొని ఉంటుంది అది చూసిన అందరూ అంతకుముందు దీప  కూర్చున్న విషయం గుర్తుకు తెచ్చుకుంటారు. తర్వాత కార్తీక్ హిమని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లి లేపుదాము.  హిమ లేవగానే అమ్మ ఏది విడాకులు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది.  దాంతో కార్తీక్ కోపంగా మీ అమ్మ లేదు  చచ్చిపోయింది అని పెద్దగా అరుస్తాడు కరెక్ట్ గా అదేే సమయానికి దీపా కంగారుగా ఇంట్లోకి వస్తుంది…….

మిగిలిన వివరాల కొరకు తరువాయి భాగం లో చూడండి…. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!