Karthika Deepam Serial 23 November 2019 Episode

Karthika Deepam Serial 23 November 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 23 నవంబర్2019 ఎపిసోడ్)

KarthikaDeepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthikadeepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthikadeepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 660 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

కార్తీకదీపం సీరియల్ 23 నవంబర్ 2019 ఎపిసోడ్ :

సౌర్య ఆవేదనని చూసిన కార్తీక్….. నాన్న హృదయాన్ని కరిగించిన సౌర్య…

కార్తీకదీపం గత ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే:-

నిజం తెలుసుకున్న సౌర్య బాధగా డాక్టర్ బాబు ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. దీప కూడా ఇంట్లోనుంచి  బయటకు వచ్చి వెక్కి…వెక్కి …. ఏడుస్తుంటుంది. ఇంతలో వారణాసి ఫోన్ చేసి సౌర్య కనబడటం లేదు అని చెప్తాడు ఇంట్లోను, స్కూల్ లోను లేదు అనియా చెప్తాడు. కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లి తల పట్టుకుని కూర్చొని ఉండగా ఇంతలో మౌనిత వచ్చి కార్తీక్ ని ఇంకా ఎక్కేస్తుంటుంది. మద్యలో దీప మౌనిత మాటలకూ కౌంటర్ ఇస్తూ ఎంటర్ అవుతుంది. సౌర్య కనిపించడం లేదు అని ….రండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని కార్తీక్ ని తీసుకొని వెళ్తుండగా ఇంతలో మౌనిత అంతా అబద్దం అంటూ దీపతో తగాదాకు దిగుతుంది. ఇంతలో సౌర్య గుడికి వెళ్ళి దేవుడుని తిడుతుంటుంది ఆ మాటలు విన్న పూజారి తనకు నచ్చ చెప్పి మీ నాన్న మంచి వాడు తప్పకుండ మారతాడు కానీ ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ప్రసాదం ఇచ్చి సౌర్య ని పంపిస్తాడు. ఇంతలో కార్తీక్ ఇద్దరినీ తిట్టి నాకు చెప్తావెంటే నీ కూతురు కనిపించక పోతే  నాకు తెలియదు నేను రాను అని కరాకండిగా చెప్తాడు… దాంతో దీప సౌర్యకి ఎం అయిన జరిగితే మీరే కారణం అని అక్కడ ఏడుస్తూ వెళ్ళిపోతుంది…. ఇంకా కార్తీక్ తనను తను మరిచి పోయి రోడ్ మిద  నడుస్తూ వెళ్తుంటాడు…  సౌర్య కూడా ఆటు నుంచి వస్తూ ఉంటుంది …..కార్తిక్ ని చూసి నాన్న అని పెద్దగా అరుస్తూ కార్తీక్ దగ్గరుకు వెళ్తుంది……

కార్తీకదీపం 660 ఎపిసోడ్ హైలైట్స్:-

సౌర్య నాన్న అని పెద్దగా అరుస్తూ కార్తిక వైపు పరేగేడుతుంది. కార్తీక్ దగ్గరకు వెళ్ళి ‘మీరే నాకు నాన్న అని ఎందుకు చెప్పలేదు నాన్న, అమ్మ బర్త్ డే కి వచినప్పుడు కూడా నాకు ఎందుకు చెప్పలేదు నాన్న,  అమ్మని ఎన్ని సార్లు అడిగిన
చెప్పలేదు డాక్టర్ బాబే మీ నాన్న అని. ఆకరికి తాతయ్య, నాయనమ్మ, బాబాయ్ ఎవ్వరు  కూడా నాకు నిజం చెప్పలేదు మా నాన్న మీకు తెలుసా …మీకు తెలుసా …. అని అందర్ని అడుగుతున్న కూడా  చెప్పలేదు. మీరు కూడా నన్ను రౌడీ ….రౌడీ…. అని అన్నారే కానీ నేనమ్మ నే నాన్నని అని నాకు నిజం చెప్పలేదు. చెప్పు నాన్న నేను ఎం తప్పు చేశాను నాన్న అని అడిగుతుంది. వారణాసి పెళ్లి చుపులుకి వెళ్ళినప్పుడు నీకు భర్త లేదు అని అందరు హేలన చేశారు అమ్మ ఇంటికి వచ్చి ఎక్కి…ఎక్కి… ఏడ్చింది. మీ గురుంచి అడిగినప్పుడల్లా అమ్మ పిచ్చిదానిలా ఏడుస్తూ ఉండేది. నేను చాల సార్లు అమ్మ మిద అరిచాను అయినా అమ్మ మీ గురుంచి చెప్పలేదు. మేము మీకోసం ఏడుస్తున్నాము అని మీకు తెలుసు కదా నాన్నఅయినా ఎందుకు దురంగా ఉన్నారు మేము వేరే ఎందుకు ఉన్నాం అమ్మని వదిలేసావ. అమ్మ, నాన్న పిల్లలు అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు మరి మనము ఎందుకు వేరు వేరు ఇళ్ళలో ఉంటున్నాము . అమ్మ ఎప్పుడు అలా  కష్టపడుతూ ఉండలా మీకు చాల డబ్బు ఉంది కదా ఎం మమ్మలిని తీసుకు వెళ్లి అంత అన్నం పెడితే ఎం అవుతుంది . ఎందుకు నాన్న అమ్మ అంటే అంత కోపం, అమ్మ చాలా మంచిది కదా అందరూ ఇష్టపడతరు మీకు ఎందుకు ఇష్టం లేదు ఏం మా అమ్మకి మీకులా  రంగులేదు అనా ఇకనైనా రండి నాన్న ఇంటికి వెల్దం అని పిలుస్తుంది ‘. దాంతో కార్తీక్ కోపం వచ్చి సౌర్య చేతిలో ప్రసాదం కింద పడేసి ‘ఎవరే …ఎవరు నీకు నాన్న …ఇంకో సరి నన్ను నాన్న అని పిలిచావు అంటే బాగుండదు వెళ్ళు ….వెళ్ళిపో ….ఇక్కడ నుంచి’ అని పెద్దగా కార్తీక్ సౌర్యని అరుస్తాడేమో  అని ఇది అంత ఊహించుకొని డాక్టర్ బాబు కనిపించినా కూడా పలకరించకుండా ఎదురు పడ్డా మాట్లాడకుండా పక్కనుంచి వెళ్తూ ఉండగా కార్తీక్ నాలుగు అడుగులు ముందుకు వేసి మల్లి వెనుకకు తిరిగి చూస్తాడు.

సౌర్య భుజం పైన చెయ్యి వేసి ఆపి ‘రౌడీ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు’. అప్పుడు సౌర్య గుడికి వెళ్ళి వస్తున్నాను నాన్న’ అని అనబోతు ఆపేసి ‘డాక్టర్ బాబు’ అని అంటుంది. కార్తీక్ ‘స్కూల్ కి  వెళ్ళాలేదా గుడికి ఎందుకు వెళ్ళవు’ అని అడుగుతాడు. సౌర్య ‘మా నాన్న రావాలని దేవుడిని అడిగాను’ సౌర్య మాటలు విన్న కార్తీక్  నాన్న హృదయం కదిలిపోతుంది. ‘మీ నాన్న గురుంచి మీ అమ్మ చెప్పలేదా’ అని అంటాడు కార్తీక్. అప్పుడు సౌర్య ‘ చెప్పదు ….మేరు చెప్పారా …..మా నాన్న గురుంచి మీకు తెలుసు కదా …..మీరు చెప్పారా ‘ అని అంటుంది. దాంతో కార్తీక్ ‘ మీ నాన్న రాడు రౌడీ ‘ అని చెప్తాడు. దాంతో సౌర్య ‘రాడా అని మీకు ఎలా తెలుసు డాక్టర్ బాబు….. మమ్మలిని మా నాన్న వద్దు అని అనుకుంటున్నాడ ….ఆ మాటలు మిమ్మలిని చెప్పమని మీకు చెప్పి పంపించాడ’ అని అడుగుతుంది. దాంతో కార్తీక్ ‘ అవి అన్ని మీ అమ్మ చూసుకుంటుంది లే చిన్న పిల్లవు నీకు ఎందుకు’ అని అంటాడు. సౌర్య అప్పుడు నేను చిన్న పిల్లని కదా నాకు ఏమి  తెలియదు కదా అయినా కూడా నేను వద్దా మా నాన్నకి, మా అమ్మ బర్త్ డే కి ఎంత ఎదురు చూసేమో మీకు తెలుసు కదా డాక్టర్ బాబు ‘ అని అడుగుతుంది. దాంతో కార్తీక్ కోపంగా ‘నీ ప్రశ్నలతో నన్ను చంపకు మీ నాన్న ఇంకా రాదు అనుకో, లేదు అనుకో వెళ్ళు మీ అమ్మ నీ కోసం వెతుకుతుంది’ అని అనగానే ‘మీకు ఎవరు చెప్పారు డాక్టర్ బాబు  మా అమ్మ మీ దగ్గరికి వచ్చి అడిగిందా’ అని అంటుంది సౌర్య అప్పుడు కాదు మీ అమ్మ వెతుకుతున్నట్టు వేరే వాళ్ళు చూసి నాకు చెప్పారు , వెళ్ళు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు’ అని అంటాడు. దాంతో సౌర్య వేల్లిపోతుంటుంది కార్తీక్ సౌర్యని చూస్తూ ఇవ్వాళా నీకు ఎం అయింది రౌడీ స్కూల్ కి వెల్ల కుండ ఎక్కడెక్కడో తిరుగుతున్దేంటి ఎప్పుడు లేంది కొత్తగా చూస్తుంది కొత్తగా మాట్లాడుతుంది’ అని అనుకుంటాడు తనలో తాను.

కట్ చేస్తే స్కూల్ కి దీప వచ్చి వాచ్ మాన్ ని అడుగుతుంది సౌర్య వచ్హిందా అని లేదు అమ్మ పొద్దున్నే వచ్చి బాగ్ పెట్టి వెళ్ళింది అంటా అని వారణాసి చెప్పాడు అని వత్చ్ మాన్ చెప్తాడు. దాంతో దీప కోపంగా ‘వారణాసి చెప్పాడా నీకు బాద్యత లేదా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకునే పని లేదా’ అని అంటుంది. వత్చ్ మాన్ ‘నేను అప్పుడే నేను పక్కకి వెళ్ళనమ్మ అని అనగానే’ దీప కోపంగా ‘నాకు ఎం చెప్పద్దు అస్సలు నీ మిద ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇవ్వాలి’ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సౌర్యని వెతకడానికి.

కట్ చేస్తే హిమ రెండు బ్యాగ్స్, క్యారేజీలు తీసుకొని ఇంటికి వస్తుంది. అది చుసిన సౌందర్య ఇంతే ఇంకో బ్యాగ్ ఎవరిది అని అడుగగా హిమ సౌర్యది నాయనమ్మ , వెంటనే సౌందర్య సౌర్యదా నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావ్ అని అడుగుతుంది. అప్పుడు హిమ ‘ఏమో తెలియదు స్కూల్ కి వాచ్చి ఫస్ట్ పీరియడ్ అటెండ్ అయిన తర్వాత బయటకు వెళ్లి పొయింది ఎక్కడికి వెళ్లిందో తెలియదు నాయనమ్మ, ఏమో ఇవ్వాళా సౌర్య చాల డల్ గా  ఉంది స్కూల్ లో కూడా’ అని చెప్తుంది. సరే నువ్వు వెళ్లి  పాలు  తాగు అని అక్కడ నుంచి హిమను సౌందర్య పంపుతుంది. ఎం అయింది దీపకు, సౌర్యకి ఇలా ప్రవర్తిస్తున్నారు అని సౌందర్య ఆనంద్ రావు, అడిత్యాల ఎదురుగా అంటుంది. అది విన్న ఆదిత్య ఎవరు అయినా ఎన్ని రోజులు పడతారమ్మ ఆ మాటలని ఇంకా అన్నయ మారదు అని వదినా, సౌర్య ని తీసుకొని ఊరు వదిలి వెళ్లి పొయ్యి ఉంటుంది అని అనగానే అది విన్న ఆనంద్ రావు దీప ఇక్కడికి రాక ముందే సౌర్య స్కూల్ నుంచి వెళ్లిపాయిందంటే ఇద్దరు కలుసుకొని ఉండరు బహుశా సౌర్య దీపకి చెప్పకుండా వెళ్లిపోయి ఉంటుంది అని అంటాడు. ఆ మాట విన్న సౌందర్య టెన్షన్ గా బయలుదేరుతుంది ఇంతలో ఆనంద్ రావు ‘ఎక్కడికి సౌందర్య’ అని అడుగుతాడు. నా పెద్ద మనవరాలు ని  వెతకడానికి వెళ్తున్న అని అంటున్నప్పుడు ఆ మాట విన్న హిమ ‘పెద్ద మనవరాలా  ఎవరు నానమ్మా ‘ అని అంటుంది. అప్పుడు ఆనంద్ రావు పెద్ద మనవరాలు అంటే మీ అత్తయ్య కూతురు ఉంది కదా తను గురుంచి లేమ్మ అని అంటాడ మరి అయితే వెతకడం ఎందుకు తాతయ్య అని అంటుంది హిమ. వాళ్ళు ఉండేది అమెరికా కదా అమ్మ అడ్డ్రెస్ నీకు తెలియదు అంటే పర్వాలేదు నేను వెతుకుతను అంటుంది మీ నాయనమ్మ అని ఆనంద్ రావు కవర్ చేస్తాడు. మళ్ళి హిమ ఇంకా ఏదో అడగబోతుంటే సౌందర్య వెళ్లి ఫ్రెష్ అయ్యి ర అని అక్కడ నుంచి పంపేస్తుంది.

మిగతా వివరాలు కొరకు తరువాయు భాగం చూడండి….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *