Karthika Deepam Serial 27 November 2019 Episode

Karthika Deepam Serial 27 November 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 27నవంబర్ 2019 ఎపిసోడ్)

KarthikaDeepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthikadeepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika Deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika Deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 663 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

 

కార్తీకదీపం గత ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే:-

ఆదిత్య శ్రవ్య దగ్గరకి వెళ్లి కోపంతో ఊగిపోతూ ఆ చిన్న దాని బాధ చూస్తుంటే నాకే నిజం చెప్పాలనిపిస్తుంది అమ్మ ఎందుకు ఆపుతుందో తెలియడంలేదు డాక్టర్ బాబే నే నాన్న అని. అది అంతా విన్న శ్రవ్య నువ్వు అవేసపడకు అత్తయ్య గారు అది చేసిన ఆలోచించే చేస్తారు కదా నువ్వు అనవసరంగా కోపం తేచుకోకు అని శ్రవ్య ఆదిత్యకి నచ్చచేప్తుంది. దాంతో ఆదిత్య కూల్ అయ్యి… అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో కార్తీక్ హిమకి ఫోన్ చేసి నేను లేటుగా వస్తాను నువ్వు తినేసి పడుకోమని హిమకి చెప్తాడు అది చుసిన సౌందర్య , ఆనంద్ రావులు ఏంటి సంగతి అని అడుగగా నాన్న లేట్ గ వస్తడంటా నానమ్మ తాగి వస్తాడేమో అని బాధగా అంటూ తన చేతిలో ఉన్న సౌర్య డ్రాయింగ్ బుక్స్ సౌందర్య చేతిలో పెట్టి తన రూమ్ లోకి  వెళ్లి పడుకుంటుంది హిమ. తరువాత సౌందర్య, అనడ రావులు సౌర్య వేసిన డ్రాయింగ్స్ చూసి తన తండ్రి కోసం ఎంత పరితపిస్తుందో  చూసి బాధపడతారు.

కట్ చేస్తే సౌర్య దీప చేత నిజం చెప్పించాలిని, దీప ఏమో సౌర్య ఎక్కడికి వెళ్లిందో ఏమి తెలుసుకుందో తెలుసుకోవాలని ఇద్దరూ అనుకుంటారు కానీ కుక్కర్ విసిల్ మోగటంతో ఇద్దరికీ కుదరదూ…ఇక్కడ బాగ్యం ఏమో హడావుడిగా అల్లుడుకి మర్యాద చేద్దామని ఇంట్లోకి వస్తుంది కానీ అప్పటికే ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తర్వతు బాగ్యం స్రవ్యని ఆర తీయగా శ్రవ్య విషయం చెప్తుంది. బాగ్యం శ్రవ్య చెప్పేది పట్టించుకోకుండా అయ్యో తన కమిషన్  మిస్ అయ్యిందని దిగులు పడుతుంది. శ్రవ్య అది విని నేను నీకు ఎలా పుట్టానో అని అనుకుటుంది.

తరువాత కార్తీక్ ఇంటికి తాగి వస్తుండగా సౌందర్య ఆపి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది…….

కార్తీకదీపం 66౩ ఎపిసోడ్ హైలైట్స్:-

దీప సౌర్యాల బాధ చూసి జాలి పడిన కార్తీక్:-

బాగా  తాగి ఇంట్లోకి వెళ్తున్న కార్తీక్ ని సౌందర్య ఆపి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటో చెప్పు మమ్మీ అని అంటాడు. కేవలం భరణాలు ,ఆభరణాలు, దాన ధర్మాలు చేస్తే మంచివారు అయ్యిపోరు అని అనగానే. ఇంకేం చేయాలి మమ్మీ అని అంటాడు. అప్పుడు వెంటనే సౌందర్య తన ఫోనులో ని వీడియో క్లిప్ తీసి చూపిస్తుంది అందులో సౌర్య పడుకొని ఉంటే దీప సౌర్యని లేపుతూ బాధ, సౌర్య కనిపడింది అనే ఆనందంతో రెండు కలకలుపుకొన్నఎమోషన్ సౌర్య మీద చూపిస్తూ ఉంటుంది దీప. ఆ క్లిప్ చూస్తూనే కార్తీక్ పక్కకి తోసివేస్తూ ‘ఎందుకు మమ్మీ ఇలాంటి దయనీయమైన దృశ్యాలు చూపిస్తావు, అంత ధయర్తాహృదయులు ఎవరు లేరు ఇక్కడ’ అని అంటాడు.

తన కోడలు, మనవరాలు గురుంచి ఆవేదన చెందుతూన్నసౌందర్య:-

దానితో ఫోన్ పక్కన పడేసి కార్తీక్ తో ఇలా అంటుంది ‘నువ్వు నా సుపుత్రుడివిరా….వంసోద్దరకుడువిరా….దేశానికి మంచి చేసే దేసోద్దరకుడువిరా…… రంగు, రూపు చూడకుండా ఎవరికీ ఇష్టం లేకపోయినా దీపను ప్రేమించి కేవలం తను ఆత్మ సౌందర్యాని చూసి ఆదర్శా వివాహం చేసుకున్న మంచి మనస్సు ఉన్న మనిషివిరా నువ్వు ఆ మనిషి ఎక్కడా…ఎం అయిపోయాడు… అని పొగుడుతూనే ఎందుకురా ఇలా అయ్యిపోయావు చంద్రుడు జాబిలిని ఇవ్వలే గాని నిప్పులు చిమ్మకుడదూరా అ మంటల్లో నీ భార్య బిడ్డలు కలిపోతున్నారురా,  ఎ అనుమాన భీజం ఎవరు నటేరో ఏ మబ్బులు నిన్ను కమ్మేసిందో అని తిడుతుంది సౌందర్య. దాంతో కార్తి నువ్వు సైకాలజీ చదివావ మమ్మీ నువ్వు గ్రేట్ అని అంటూనే దుర్మర్గుడివి అని తిడుతున్నావు అని అంటూనే నేను మాములు మనిషినే మమ్మీ నాకు ఉచ్చం నీచం ఏది మంచి చెడు నాకు తెలుసు మమ్మీ నువ్వుఎందుకు నన్ను తప్పు పడుతున్నావు అని అంటాడు. అప్పుడు సౌందర్య ‘ నేను నిన్ను ఏమి తప్పు పట్టడం లేదురా వాళ్ళు ఉన్న ధౌర్బాగ్య స్థితిని చూసి తట్టుకోలేక నిన్ను అర్దిస్తున్ననురా ఇంటి కోడలు ఉసురు తగలకుండా ఈ ఇంటి ఇలవేల్పు కూడా ఆపలేదురా, తండ్రి తాలుకు క్షోభ మన వంశానికి తగులుతుందిరా,నీకు ఒక కూతురు ఉంది రేపు నీ తమ్ముడుకి కూడా ఒక బిడ్డ పుడుతుంది ఈ ఇంటికి ఎలాంటి శాపం తగలు కూడదని….అని సౌందర్య మాట్లుడుతుండగానే  కార్తీక్ ‘స్టాప్ ఇట్…..స్టాప్ ఇట్ …మమ్మీ’ అని సౌందర్య మాటలని కండిస్తూ కార్తీక్ ఇలా అంటాడు ‘ప్లీజ్ మమ్మీ దాని కూతురు కనిపించక పోతే అది వచ్చి నా మీద ఎగుర్తుంది నువ్వేమో వాళ్ళు ఇద్దరు బాధపడితే నీ గుండే కరిగిపోతుంది నా దగ్గరకు వచ్చి నన్ను తిడుతావు, నువ్వు నిజంగా ఈ ఇంటికి వాళ్ళు ఉసూరు తగలకూడదు అనుకుంటే ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు నాకు జీవితాంతం నాకు కనిపించకూడదు ఈ ఇంటికి రాకూడదు అని ఉంటూ ఉండగానే….. సౌందర్య కార్తీక్ చెంప పగల కొడుతుంది…..

సౌందర్య మీద హిమ కోపం….

కరెక్ట్ గా అదే సమయంలో హిమ కార్తీక్ ని కొట్టడం చూసింది. వెంటనే హిమ అక్కడికి వచ్చి ‘కొట్టవ నాయనమ్మ, నీకు ఇంకేప్పటికి మా నాన్న నీకు నచ్చడా’ అని అంటుంది. ఇంతలో కార్తీక్ ‘నువ్వు ఇంకా పడుకోలేదమ్మ’ అని అడుగుతాడు. ‘లేదు డాడీ నువ్వు తాగి వస్తావని నాయనమ్మ తెలుసు ఇలాంటిదేదో జరుగుతుంది అని మేలుకొని ఉన్నాను’ అని హిమ అంటుంది సౌందర్యాని కోపంగా చూస్తూ. కార్తీక్ ‘వెళ్లి పడుకో మమ్మీ ఏమి ఆలోచించకుండా అని అంటూ హిమతో లోపాలకి వెళ్తూ అంటాడు.

ఎలాగైనా అమ్మనాన్నలు కలపాలని నిర్ణయించుకున్న సౌర్య:

కట్ చేస్తే సౌర్య ఇంట్లో పడుకొని నాన్న ఎందుకు మమ్మలిని వాళ్ళ ఇంట్లోకి రానివ్వడం లేదు బహుశా నాన్నకి నేను ఇష్టం లేదనుకుంటా అని అనుకుంటూ ‘అంతక ముందు కార్తీక్ ప్రేమగా రౌడీ అని పిలుస్తున్నది గుర్తుతెచ్చుకొని’ లేదే అలాగైతే నన్ను నాన్న రౌడీ….రౌడీ..అని ముద్దు పేరుతో ఎందుకు పిలుస్తాడు అని అనుకుంటుంది. అదే సమయంలో దీప అంట్లు తోముకుంటూ ఉంటుంది… అమ్మ మంచిదే, నాన్న మంచివాడే మరి ఎందుకు ఇద్దరికి గొడవ….. ఇంతలో దీప రాకను గమనించిన సౌర్య నిద్రపోతున్నట్టు నటిస్తుంది సౌర్య …..దీప కూడా కాంగా పడుకుంటుంది సౌర్య పక్కనా….మళ్ళి సౌర్య లేచి ఇలా అనుకుంటుంది మనసులో ‘ఎం జరిగిందో తెలుసుకోవాలి ఎలాగైనా అమ్మనాన్నని కలపాలి’.

వంటలక్కకి నాన్నకి పెళ్లి చేయాలనీ నిర్ణయించుకున్న హిమ:-

సౌందర్య కొట్టేసరికి హిమ కోపంగా కార్తీక్ ని అక్కడనుంచి తీసుకొని వెళ్లి తన రూమ్లో పడుకోపెడుతుంది. కార్తీక్ తాగిన మైకంలో పడుకున్దిపోతాడు. హిమ వాళ్ళ నాన్న చూసి బాధపడుతూ జరిగినవి అన్ని గుర్తు తేచ్చుకుంటుంది ‘అన్నం తినేటప్పుడు నేను తిన్నానో లేదో ,పడుకున్ననో లేదో ఎవరూ పట్టించుకోరు ఎవరికీ అక్కరలేదు అని కార్తీక్ అన్న మాటలని, మౌనిత ఉన్నప్పుడు భార్య ఎలా ఉండాలో చెప్పిన సౌందర్య మాటలని, భర్త ఇంటికి వస్తే ఎలా చుసుకోవలో చెప్పిన దీప మాటలని అలాగే కార్తీక్ ఇంటికి వచ్చినప్పుడు దీప ఎలా చూసుకుందో..’ ఇవి అన్ని గుర్తు తేచుకుంటుంది హిమ. అవి అన్ని గుర్తు చేసుకుంటూ నాన్న నిన్ను చూసుకోవడానికి ఒక అమ్మని తేవాలి అది వంటలక్కే అయితే ఇంకా బాగుంటుంది. అప్పుడు మనం అందరంకలసి వేరే ఇంట్లో హ్యాపీగా ఉండచ్చు అని అనుకుంటుంది. నేను సౌర్యని అడిగి తప్పు చేశాను ఈసారి వంటలక్కనే డైరెక్ట్ గా అడుగుతాను వంటలక్క ఒప్పుకుంటే చాలు కదా అని అనుకుంటుంది.

హిమ, సౌర్యాలు ప్రవర్తన చూసి ఆనందరావు దగ్గర సౌందర్య ఆవేదన:-

ఆనంద్ రావు నిద్రపోతుంటాడు ఎందుకో మెలుకువ వచ్చి లేచి నువ్వు పడుకోవా అని అడుగుతాడు సౌందర్యాని. అప్పుడు సౌందర్య ‘మీరు నిద్రపోండి నాకు నిద్రపట్టడం లేదు ఇంట్లో మేకు ఎం జరిగిన సంబంధం లేదుగా అని అంటుంది’. ఆనంద్ రావు ‘ఇప్పుడు ఏమైంది’ అని అడుగుతాడు. సౌందర్య ‘ఇవ్వాళా కర్తిక్ ని కొట్టాను’ ఆ మాట వినగానే మంచి పని చేసావ్ అని అంటాడు ఆనంద్ రావు. సౌందర్య ‘కానీ నేను కొట్టడం హిమ చుసేసింది నేను వాళ్ళ నాన్నని, తనని ఏదో రాచి రంపాన పెడుతున్నట్టు కోపంగా చూస్తూ అక్కడ నుంచి వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్లి పోతుంది, , ఇంకా ఆ  రౌడీ ఏమో విచిత్రంగా చూస్తుంది, విచిత్రంగా మాట్లాడుతుంది, వెళ్ళు ఇద్దరు ఎం ఆలోచిస్తున్నారో రేపు ఏంజరుగుతుందో అని నాకు బయమేస్తుంది’ అని అంటూ తన బాధని ఆనంద్ రావు దగ్గర వెళ్ళకక్కుతుంది సౌందర్య.

దీపను కార్తీక్ దగ్గర ఇరికిచ్చిన సౌర్య:-

మరుసటి రోజు దీప పక్కింటి సరోజాక్క వచ్చి మా తమ్ముడికి గుండే వచ్చినట్లుంది అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి దీప నీ దగ్గర ఏమైనాడబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది. అది విన్న దీప ‘అయ్యో సరోజక్క ఉన్న డబ్బులు అన్ని ఉడ్చి మొన్నే చిటి కట్టాను’ అని చెప్తుంది. ఆ సంబాషణ అంత విన్న సౌర్య ఎం పర్వాలేదు సరోజక్క నేను డాక్టర్ బాబు దగ్గరికి తీసుకొని వెళ్తాను కదా అయన మీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు డాక్టర్ బాబు చాల మంచి వారు మా అమ్మ చెప్తే తప్పకుండ చేస్తారు అని అంటుంది. దాంతో దీప ‘వద్దు… వద్దు…. అంతదూరం ఎందుకు ఇక్కడ దగ్గరిలో హాస్పిటల్ కి తీసుకు వెళ్దాము అని అంటుంది. సౌర్య దీప మాటలు వినిపించుకోకుండాసరోజక్కకి వారణాసిని ఇచ్చి పంపుతుంది. దీప ఇలా ఇరికించింది ఏంటి  సౌర్య…..ఆపరేషన్ చెయ్యమంటే డాక్టర్ బాబు తిడతారు….. ఆపరేషన్ అక్కడ వద్దులే అంటే సౌర్య ఏంటి అని ఊ వంద ప్రశ్నలు అడుగుతుంది ….ఇప్పుడు ఎం చేయాలి దేవుడా…..అని అనుకుంటుంది దీప…

మిగతా వివరాలు కొరకు తరువాయు భాగంలో చూడండి…….

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *